అక్షిత సమరం తో ప్రజల జీవితాల్లో వెలుగులు.. ప్రతిక్షణం ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం

  • అక్షిత సమరం తో ప్రజల జీవితాల్లో వెలుగులు
  • ప్రతిక్షణం ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం
  • జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్

వరంగల్, అక్షిత బ్యూరో: అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక ప్రజల గొంతుకై ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తూ సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను తట్టి లేపుతూ ఎప్పటికప్పుడు నిజాలు సమాజానికి తెలుపడంలో జర్నలిజం విలువలు పాటిస్తూ సమాజాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న జాతీయ తెలుగు దినపత్రిక అక్షిత సేవలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగమని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సౌరం ప్రవీణ్ కుమార్ అన్నారు.

జాతీయ తెలుగు దినపత్రిక అక్షిత 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ విలువలు అంతరించిపోతుందనేటి సమాజంలో సమాజాన్ని తట్టి లేపుతూ నోరులేని వారి గొంతుకై వారి సమస్యల పరిష్కారానికి సమాజానికి తెలియజేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రజల ఎదుర్కొంటున్న వివిధ రూపాల సమస్యలు పరిష్కారం కోసం అక్షిత చేస్తున్న కృషి స్లాగనీయమన్నారు.

ఇంతింతై, వటుడింతై అన్న చందంగా అనతి కాలంలోనే ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఆకర్షణీయమైన కథనాలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు ఎప్పటికప్పుడు అన్నిటికంటే ముందుగా సుత్తి లేకుండా సూటిగా ప్రచురిస్తూ విలువను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న అక్షిత మరింత ఎదగాలని ఆకాంక్షించారు. బాలల పరిరక్షణ అధికారులు..

ఎం మౌనిక,చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్ భాస్కర్,చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికి సుధాకర్,అక్షిత బ్యూరో చీఫ్ డాక్టర్ పాలడుగుల సురేందర్, హనుమకొండ స్టాపర్ కోడెపాక శ్రీకాంత్ ముల్కనూర్ రిపోర్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking