- పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు…
- జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం…
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య….
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి : జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయాల్సిన జర్నలిస్టు సంఘాలు అధికార పదవుల కోసం పాలక పక్షాలకు అమ్ముడు పోతున్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు.జర్నలిస్టు సంఘాలు ప్రజల పక్షం ఉండాలే తప్ప పాలకుల పక్షం ఉండరాదని అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా నాలుగవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతుందని,ఈ వైఖరిని జర్నలిస్టులు సమిష్టిగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం తొమ్మిదేళ్లు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా తీరని అన్యాయం చేసిందని,అదే బాటలో నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళైన ఏ ఒక్క సమస్యను పరిష్కరించ లేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని అన్నారు. కొత్త అక్రెడిటేషన్ల కోసం రెండేళ్ల తర్వాత మొన్న జారీ చేసిన 252 జీవో తప్పుల తడకగా ఉందని,ఈ జీవోను ఇంకా సవరించ లేదని తెలిపారు.జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఊసే లేదని,సుప్రీం కోర్టు తీర్పు సాకుతో ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని అన్నారు.రాష్ట్రంలో రెండు జర్నలిస్టు సంఘాలు పాలకుల పక్షాన చేరి జర్నలిస్టులకు సమస్యలను పక్కన పెడుతున్నాయని,కలిసి పోరాటం చేశాయలేని పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని అన్నారు.ఈ సమావేశంలో సంఘ జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం,రాష్ట్ర కో–కన్వీనర్లు బండి విజయ్ కుమార్,తన్నీరు శ్రీనివాస్,కుడితాడి బాపురావు,జి. వెంకటేశ్వర్లు,ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి.సంతోష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎంపిక…
టిడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య,జిల్లా కార్యదర్శిగా ముశం హరిప్రసాద్,కోశాధికారిగా తాందారపల్లి శ్రీనివాస్,ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షుడిగా లింగాల సాయి,కార్యదర్శిగా నందిపాటి సైదులు, ఉపాధ్యక్షులుగా వంగాల వెంకన్న, ఒగ్గు సోమన్న,గుడపూరి ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.