మద్యం సేవించి దాడికి పాల్పడ్డారు.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

  • మద్యం సేవించి దాడికి పాల్పడ్డారు
  • జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

వరంగల్, అక్షిత బ్యూరో: శుక్రవారం తన నియోజకవర్గం లో కొంత మంది కాంగ్రెస్ నాయకులు మద్యం తాగి వచ్చి తన పై దాడి చేశారనీ జనగామ మాజీ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అతని కొడుకు ప్రశాంత్ రెడ్డి వారి అనుచరులకు మద్యం తాగించి కావాలనే తన మీద వరుస దాడికి ప్రోత్సహించారన్నారు. మంత్రి సీతక్క ఆహ్వానం మేరకు జనగామ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వెళ్లగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా కొబ్బరికాయ కొట్టమని చెప్పాననీ కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావాలని తాగి వచ్చి పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారనీ గులాబీ జెండా పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కాండిడేట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావాలని తన మీద పలు సార్లు దాడి చేయించాడన్నారు. శుక్రవారం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొడుకు కింద తిరిగే అనుచరులు తాగి వచ్చి కావాలని దాడి చేశారనీ జనగామలో ప్రశాంతత లేకుండా కావాలని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారనీ రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు తామే గెలుస్తామనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీతక్కకు మా పార్టీ మంత్రులు ఎంత గౌరవం ఇచ్చారో ఆమె గుర్తుచేసుకోవాలనీ జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనగామ బారాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking