టి పి సి సి జనరల్ సెక్రటరీ వి.జగదీశ్వర్ గౌడ్ చే అక్షిత దినపత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ..

శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి:  అక్షిత దినపత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంను టిపిసిసి జనరల్ సెక్రటరీ, శేరిలింగంపల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జగదీశ్వర్ గౌడ్ చేతుల మీదుగా శుక్రవారం రోజున నల్లగండ్ల వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షిత దినపత్రిక లో వారు రాసే వార్తలు ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకి, ప్రజా ప్రతినిధుల దృష్టి కి తీసుకెళ్లి వారి మధ్య వారధిగా పనిచేస్తూ సత్వరం స్పందించి సమస్యలను పరిష్కారం చేసే విధంగా పని చేయడం అభినందనీయం అని అన్నారు. అలాగే పత్రికా యాజమాన్యం కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాజిద్ , మియా పూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ దోర్నాల రవికుమార్ గౌడ్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుడుకుంట్ల రాంబాబు, నర్సింలు, తెలంగాణ అంబేద్కర్ సంఘము రాష్ట్ర అధ్యక్షులు పోతరాజు లాలయ్య, వై.రాంబాబు, రాచమల్ల భాస్కర్ గౌడ్, శశిధర్ పట్వారీ, కాంగ్రెస్ పార్టీ యువ నేత మిరియాల ప్రీతం కుమార్, శేరిలింగంపల్లి అక్షిత దినపత్రిక ప్రతినిధి బండి రామకృష్ణ గౌడ్, వంగ సదానందం లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking