సత్తుపల్లి, అక్షిత న్యూస్: శుక్రవారం సత్తుపల్లి పట్టణంలోని వెంగళరావు నగర్ కాలనీ, రోడ్డు నెంబర్ 9లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వర్గుటి సుధాకర్, భాగ్యలక్ష్మి ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద వాడి సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క కి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరావు లకు ప్రజలు అందరి తరుపున ధన్యవాదములు తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డుల్లో సుమారు 700 వందల వరకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేసుకుందాం అని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల ను అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు.