- అక్షిత 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
- ప్రజా సమస్యలపై అక్షిత కథనాలు సమాజానికి దిశానిర్దేశం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
- బాధ్యతాయుత జర్నలిజానికి అక్షిత ప్రతీక : డి.ఎస్పీ రెహమాన్
- సమాజ హితమే లక్ష్యంగా అక్షిత పత్రిక కథనాలు – గురజాల గోపి
భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత ప్రతినిధి: సమాజ హితాన్ని కేంద్రంగా చేసుకుని ప్రజా సమస్యలను నిస్సంకోచంగా వెలుగులోకి తీసుకొస్తున్న అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక సేవలు ప్రశంసనీయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్షిత జాతీయ తెలుగు దినపత్రిక 2026 నూతన క్యాలెండర్‌ను ఆయన అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత, చట్ట పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై అక్షిత పత్రిక నిరంతరం అవగాహన కల్పిస్తూ బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని కొనసాగించడంఅభినందనీయమన్నారు.గ్రామీణ ప్రాంతాల సమస్యల నుంచి జిల్లా స్థాయి పరిణామాల వరకు వాస్తవాలను నిష్పక్షపాతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో అక్షిత పత్రిక కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు.ముఖ్యంగా సామాన్యుల గొంతుకగా నిలిచి, ప్రజాస్వామ్య విలువలను కాపాడే దిశగా చేస్తున్న కథనాలు సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రెహమాన్ మాట్లాడుతూ, ప్రజలు , పాలన మధ్య వారధిగా నిలుస్తూ, చట్టసభ్యత, సామాజిక బాధ్యతలపై అక్షిత పత్రిక ప్రచురిస్తున్న కథనాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని అన్నారు. నిజమైన జర్నలిజం సమాజాన్ని సరిదిద్దే శక్తి కలిగిఉంటుందని, ఆ దిశగా అక్షిత పత్రిక తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని అభినందించారు.అలాగే జిల్లా కాంగ్రెస్ నాయకులు గురజాల గోపి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రశ్నిస్తూ, సామాన్యుల పక్షాన నిలిచే పత్రికగా అక్షిత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, అక్షిత పత్రిక ప్రజా ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే విధంగా జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అక్షిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో డేగల కృష్ణ ప్రసాద్, ఆర్‌సీ ఇంచార్జ్ వెన్నం సతీష్, భాస్కరాచారి, విజన్ ఆంధ్ర బ్యూరో వినోద్, తెలంగాణ వాణి ప్రతినిధి నాగార్జున చారి (జనం సాక్షి) తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్‌కు అక్షిత పత్రిక బృందం కృతజ్ఞతలు తెలిపింది.
