హనుమకొండ జిల్లాలో పుట్టగొడుగుల మెడికల్ షాప్ లు ?
అసలు షాపులకు అనుమతులు ఉన్నాయా?
*రోగులకు మందులిచ్చేది ఫార్మసిస్టులేనా?
హనుమకొండ, అక్షిత ప్రతినిధి:
హనుమకొండ జిల్లా ఆరేపెల్లి గ్రామానికి చెందిన ఓ ఫార్మాసిస్ట్ డ్రగ్ కంట్రోల్ అధికారిని కలవడాని బుదవారం డ్రగ్ కంట్రోల్ జిల్లా కార్యాలయానికి వచ్చారు. అధికారి అందుబాటులో లేక పోవడం, తనిఖీల్లో భాగంగా ఇతర ప్రాంతానికి వెళ్లినట్లు సిబ్బంది చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగి పోయారు. ఎప్పుడు కార్యాలయానికి వెళ్లిన అధికారి పర్యవేక్షణలో ఉన్నట్లు సిబ్బంది చెబుతుంటారనే ప్రస్తావన ప్రచారంలో ఉంది. అందుకు నిదర్శనంగా లబ్ధిదారులకు సిబ్బంది చెప్పిన సమాధానం రుజువుగా నిలిచింది. ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నప్పుడు తనిఖీల్లో గుర్తించిన వాస్తవాలేంటన్న సందర్భం ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపుల నిర్వహణ జరుగుతోందని అనేక అరోపణలు ఉన్నాయి.మందులిస్తున్న వారెవరూ..? ఆ మెడికల్ షాపులో అసలైన ఫార్మసిస్టు ఉన్నారా మెడికల్ షాపులలో ప్రజలకు మందులు అందిస్తున్న వారు ఎవరు? ప్రతి ఫార్మసిస్ట్ కు బదులు ఇతరులు ఉండడం, అర్హత లేనివారు మందులు అమ్మడం, ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం, మందులు కొన్నవారికి బిల్లులు,ఇవ్వకపోవడం, అనవసరమైన మందులు ఇచ్చి వ్యాపారం పెంచుకోవడం, ప్రజల వద్ద అధిక ధరలు వసూల్ చేయడం ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయనే అనుమానాలున్నాయి. అలాంటప్పుడు అధికారులు ఎక్కడ తనిఖీలు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ షాపులకి అందరికీ అనుమతులిచ్చారా..?పదులు కాదు, వందలు కాదు వేల సంఖ్యలో మెడికల్ షాపులు కనిపిస్తున్నాయి. వారందరికీ అనుమతులు ఇచ్చారా? లేక ప్రీతికరమైన సంబంధాలు కలిగి ఉన్నారా? నిజానికి హనుమకొండ జిల్లాలో ఎన్ని మెడికల్ షాపులు ఉన్నాయి. అందులో ఎన్ని రకాల మందులు అమ్ముతున్నారు. ప్రజలకు ప్రమాదకరమైన మందులు ఏమైనా మార్కెట్లో కొనసాగుతున్నాయా? అనే అనుమానాలు వెలుపడుతున్నాయి .ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సంబంధిత అధికారి అందుబాటు లో ఉన్నప్పుడే సాధ్యమౌతుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు తమ మౌనం విడిచి తక్షణమే పర్మిషన్ లేని షాపులని మూసివేసేలా తాగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.