నేటి నుంచి బౌరాపూర్ జాతర

నేటి నుంచి బౌరాపూర్ జాతర

ఏర్పాట్లను పరిశీలించిన

తహసిల్దార్ బి వెంకటేష్

నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి :

లింగాల మండల పరిధిలోని అప్పాపూర్ పెంట గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి సంవత్సరం జరిగే బౌరాపూర్ జాతర శనివారం నుండి 14వ తేదీ నుండి సోమవారం 16 వ తేదీ వరకు జరగబోతుంది. ఆలయం దగ్గర అన్నీ ఏర్పాట్లు. లింగాల తాసిల్దార్ బి వెంకటేష్ పరిశీలించారు. ఎలాంటి సమస్యలు లేకుండా ఆలయ పక్కన ఉన్నటువంటి చెరువు పరిశీలించారు. దేవాలయ గుడి ఆవరణలో భక్తులకు అన్ని సౌకర్యాలు త్రాగునీరు. మరుగుదొడ్లు. భోజన ఏర్పాట్లు. దేవాలయం చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 14వ తేదీ నుండి భక్తులు ఆలయం దగ్గరికి చేరుకుంటారు. లింగాల మండలంలోని అన్ని గ్రామాలలోని చెంచు కుటుంబాల కు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి భక్తులను అక్కడికి చేరవేస్తారు.14వ తేదీ రాత్రి భక్తులు చిన్నారులు నృత్యం చేసి ఆకట్టుకుంటారు. 15వ తేదీ అచ్చంపేట నియోజకవర్గంలోని అబ్రాహాబాద్ లింగాల్ తదితర ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు పాల్గొంటారు. తహసిల్దార్ వెంట డిప్యూటీ తాసిల్దార్ కృష్ణాజి ఆర్ఐ అనిల్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking