మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి: మిర్యాలగూడ పట్టణంలో బీసీ వర్గాల ఆశయాలు, ఆకాంక్షలు ప్రతిబింబించాలంటే మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకే ఇవ్వాలి అనే గట్టి నినాదంతో ఆదివారం సుమారు 500 మందికి పైగా బీసీ వర్గాల నాయకులు, వార్డు నాయకులు, యువత, ప్రజలు ఐక్యంగా మిర్యాలగూడ క్యాంపు ఆఫీసుకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మా రెడ్డికి అన్ని బీసీ వర్గాలు, వార్డు నాయకులు బీసీ మహిళకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలనే డిమాండ్‌తో వినతి పత్రం సమర్పించారు. పద్మశాలి సంఘం తరపున 31వ వార్డు కౌన్సిలర్ చిలుకూరు సుధా బాలుకు ఇవ్వాలని, 30వ వార్డు కౌన్సిలర్ ఎ.విజయ గిరిధర్ కు ఇవ్వాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, మున్నూరు కాపులకు ఇవ్వాలని ఆ సంఘం నాయకులు వేర్వేరుగా ఎమ్మెల్యే ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
