పసిపాప మృతికి కారణమైన దుండగులను కఠినంగా శిక్షించాలి

పసిపాప మృతికి కారణమైన
దుండగులను కఠినంగా శిక్షించాలి

కొల్లాపూర్, అక్షిత ప్రతినిధి :

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో కుమ్మెర జాతరలో మరణించిన పసిపాప కుటుంబానికి అండగా నిరసన కార్యక్రమం చేపట్టారు. పసిపాప మృతికి కారణమైన 8 మంది నిందితులను కఠినంగా శిక్షించాల్సి ఉండగా అందులో కేవలం నలుగురిని మాత్రమే అరెస్టు చేయగా మిగతా నలుగురు పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం విఫలమైందని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే నిందితులకు కఠినమైన శిక్షలు పడాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మరియు నిందితులపై మర్డర్ కేస్ పెట్టాలని వారు డిమాండ్ చేశారు.

నిందితులకు శిక్ష పడేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జగ్జీవన్ రావు వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు బోరెల్లి సంగమయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు పుట్టపాక రాము, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు మంద నరసింహ, మేకల రాముడు, కలమంద శేఖర్, బీఎస్పీ జిల్లా కోశాధికారి బి. దాస్, దళిత దండు నాయకులు మల్లెల వెంకటస్వామి, కోళ్ల బాలస్వామి, చాకలి రవి, గౌడ సంఘం నాయకులు కృష్ణయ్య గౌడ్, చందన్ గౌడు, సుదర్శన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, బంకల మూర్తి, కేశపాక మహేష్, ఎమ్మార్పీఎస్ నాయకుడు శీలం కురుమయ్య, శీలం వెంకటేష్, పసుపుల కురుమయ్య, పగిడాల బాలకృష్ణ, బీసీ నాయకులు చంద్రయ్య, ఆది వసంత కుమార్, సురేష్, జిలకర కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking