మా వార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

మా వార్డు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

చేర్యాల అక్షిత ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం చేర్యాల మున్సిపల్ పట్టణ ఏడో వార్డులో వార్డు సభ నిర్వహించగా, ఈ సభ కార్యక్రమానికి హాజరైనటువంటి స్పెషల్ ఆఫీసర్ పీడీ కి, మున్సిపల్ కమిషనర్ కి, వార్డు ఆఫీసర్, డిప్యూటీ తహసిల్దార్ కి స్థానిక కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ తో పాటు స్థానిక వార్డు ప్రజలందరూ వార్డులో ఉన్న సమస్యలపై, ప్రధాన సమస్య వర్షం నీరుతో ఈ ప్రాంతమంతా ముంపుకుగురవు తుంది అని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తెలుపాలని అలాగే సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తదితర సమస్యలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నరేందర్, ఆంజనేయులు, చంద్రమౌళి, దినేష్ ,గణేష్, స్వామి, శ్రీను, సందీప్, రాములు, మహిళలు, విద్యుత్ శాఖ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking