జగిత్యాల, అక్షిత బ్యూరో: జగిత్యాల పట్టణంలోని నవ్య బాలిక జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ బోర్డు ఏప్రిల్ 12 ఆదివారం రోజున ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో స్థానిక పట్టణ నవ్య బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు యంపిసి మొదటి సంవత్సరంలో 467/470 మార్కులతో ఓదెల శ్రీవర్ష రాష్ట్ర స్థాయి మూడవ ర్యాంకు, బైపిసి మొదటి సంవత్సరంలో ఏ.ప్రఖ్య 433/440 మార్కులతో మరియు యంపిసి రెండో సంవత్సరంలో బోరగల్ల హంసిక 990/1000 , గుమ్ముల రోహిత్ 987/1000, బైపిసి రెండో సంవత్సరంలో సాంబారి హిమవర్షిని 982/1000 రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు.విద్యార్థులను కళాశాల కరెస్పాండెంట్ శ్రీపాద నరేష్ , ప్రిన్సిపల్ గాలిపెల్లి ఈశ్వర్ కుమార్ మరియు కళాశాల అధ్యాపకులు అభినందించారు.



