అంబేద్కర్ కన్న కలలు, ఆశయం నెరవేరాలి

నంగునూరు, అక్షిత ప్రతినిధి: నర్మెట్ట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. మనిష్ కుమార్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మేధావి మహనీయునీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ

అణగారిన వారికి రాజ్యాధికారం

వచ్చినప్పుడే ఈ భారత దేశనికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు ఆయన రాసిన రాజ్యాంగంనికి ఒక్క విలువ ఉంటుందని

రాజ్యాధికారం సాధించని జాతి యొక్క ఆశలు, ఆకాంక్షలు వారికి రాజ్యాధికారం చేజిక్కించుకున్నప్పుడే సాధ్యమవుతాయని అంబేద్కర్‌ అన్నారనీ మనిష్ కుమార్ పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారిపై కొనసాగుతున్న అన్నిరకాల పీడనలు అంతరిస్తాయని అంబేద్కర్‌ బలంగా నమ్మారనీ దళితులు రాజకీయ ప్రాతినిధ్యాన్ని, వారి రాజకీయ ఆకాంక్షలను ప్రతిఫలించే ‘షెడ్యూల్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌’, ‘ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ’ ఏర్పాటు చేశారనీ. ఆ సంస్థలు ఆయన మరణానంతరం రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా గా పరిణామం చెందడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఒకవైపు అంబేద్కర్‌ వారసులను, ఆయన భావాల వెలుగులో ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్న మేధావులను ఆయన ఆశయ రథాన్ని ముందుకు తీసుకెళ్తున్న కార్యకర్తలను హతమార్చి, మరోవైపు ఆయనకు జయంతి ఉత్సవాలను ఘనమైన క్రతువుగా నిర్వహించడం.వారి ద్వంద్వవైఖరి అన్నారు. దీనిలో అగ్రకుల రాజకీయ చాణక్యం దాగి ఉంది. క్రమంగా అంబేద్కర్‌ భావజాల స్ఫూర్తి దళితులకు అందుతుంది. కాబట్టి వారు అగ్రకుల బూర్జువా పార్టీల ద్రోహాన్ని గ్రహించి, సంఘటితమవ్వకుండా ప్రభుత్వాలు హఠాత్తుగా అంబేద్కర్‌ పాటపాడడం మొదలు పెట్టాయనేది సుస్పష్టం. అంబేద్కర్‌ ప్రకారం ప్రాచీనకాలంలో బుద్ధుని సామాజిక విప్లవాన్ని నిర్మూలించే క్రమంలో బ్రాహ్మణవాదులు బుద్ధుడిని విష్ణువు దశావతారాలలో ఒకటిగా కలుపుకున్న ప్రతీఘాత విప్లవం అచ్చం నేటి ప్రభుత్వాలు సన్నాయి నొక్కులవంటిదే దళితులైనా అగ్రకుల పార్టీలైన అంబేద్కర్‌ వ్యక్తి పూజ చెయ్యడం, ఆయన్ని విగ్రహ మాతృడిగా కుదించడం అనేది ఆయన భావాలకు పూర్తిగా విరుద్ధమైనది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దమనకాండలు ఆపాలి. చైతన్యవంతులైన దళిత మేధావులను, యువతను దేశద్రోహులుగా ముద్రవేసి, వారిని బోనెక్కించడం మానాలి. అంబేద్కర్‌ భావాలకు తూట్లు పొడుస్తూ ఆయనకు పెద్ద పెద్ద విగ్రహాలు కట్టడం అనేది మన తెలుగుకవి అన్నట్టు ‘చంపి గుడికట్టి పూజించే సంప్రదాయం’గానే భావించాలి. ఇటీవల దళితులు, స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు, అక్రమాలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా ఉండి, మళ్ళీ మనువాదాన్ని ప్రతిష్టించే విధంగా మారుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో అడుగంటుతున్న ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందనీ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking