15వ బెటాలియన్‌లోఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు
సత్తుపల్లి, అక్షిత న్యూస్:
మంగళవారం నాడు 15వ బెటాలియన్ , బి. గంగారం, సత్తుపల్లి లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి . ఆర్ . అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాలపు కమాండెంట్ ఎ. అంజయ్య హాజరై, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిఘననివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అయిన భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర అపారమని, ముఖ్యంగా నిమ్న వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.అంబేద్కర్ ఉపాధ్యాయునిగా, న్యాయవేత్తగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ నాయకుడిగా,పత్రికావ్యవస్థాపకుడిగా,ఉద్యమకారుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించి సమాజానికి ఆదర్శమూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సహాయ దళాధిపతి ఎ.నర్సింహా,ఆర్.ఐలు,ఆర్.ఎస్.ఐలు ఇతర అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 