ఇంద్రపాలనగరం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఇంద్రపాలనగరం లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

రామన్నపేట అక్షిత ప్రతినిధి

ఇంద్రపాలనగరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్థానిక ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ ప్రధాన రహదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాలవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన జయంతి కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ నాగరాజు గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, అమినోద్ధిన్, నర్సింహా, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking