పల్లివాడలో అంబేద్కర్ జయంతి వేడుకలు.
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని పల్లివాడ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం, విద్యకు అంబేద్కర్ ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేశారు.ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో దండిగా పాండు, కంబాలపల్లి మధు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు కంకణాల లక్ష్మారెడ్డి, గడ్డం యాదగిరి, దండిగా బిక్షమయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.