పిల్లలకు ఆత్మీయ
నడవడిక అవసరం
ఆత్మీయతతోనే
పిల్లల భవిష్యత్
దేశాన్ని ప్రేమిస్తున్న
స్పూర్తి చిల్డ్రన్
మినిస్ట్రీస్ బుక్స్ పంపిణి
సిబిసిలో ముగిసిన
సిబిసి శిక్షణ
రిసోర్స్ పర్సన్
బ్రదర్ రత్నం రాజు
సిబిసి డైరెక్టర్ బ్రదర్ పుట్టల జోసఫ్ డానియల్
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
పిల్లలకు ఆత్మీయ నడవడిక అవసరం. ఆత్మీయతతోనే పిల్లల భవిష్యత్. మొక్కై వంగనిది.. మానై వంగునా అన్న తరహాలో బాల్యం నుంచే బిడ్డలను ఆత్మీయ బాటలో నడిపించాలి. చదువుతో పాటు సంస్కారం, ఆత్మీయ భావాన్ని పెంపొందించాలని సిబిసి రిసోర్స్ పర్సన్ బ్రదర్ రత్నం రాజు అభిలషించారు.మంగళవారం వేములపల్లి సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో చిల్డ్రన్ బైబిల్ క్లబ్ (సీబీసీ) టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాo జరిగింది. ప్రతి ఏడాది మాదిరిగానే స్పూర్తి చిల్డ్రన్ మినిస్ట్రీస్ ఆయా సంఘాలు, టీచర్లకు ఉచితంగా సిబిసి బుక్స్ ను అందించారు. తొలుత ప్రార్ధనతో ఆరంభించగా రిసోర్స్ పర్సన్ బ్రదర్ రత్నం రాజు ప్రసంగిస్తూ బాల్యం నుంచే బిడ్డలను ఆత్మీయ బాటలో నడిపించేందుకు తల్లితండ్రులు సహకరించాలన్నారు.

విద్యాలయాలకు వేసవి సెలవులు ముగియగానే ప్రతి ఏడాది ఆయా సంఘాల్లో చంటి బిడ్డలకు ఆత్మీయ తర్పీద్ లో భాగంగా గతంలో విబిఎస్ ప్రస్తుతం సీబీసీగా ఆత్మీయ పాఠాలు బోధిస్తారు. అందును పురస్కరించుకొని టీచర్లకు బైబిల్ బోధన విధానాలు, పిల్లల ఆత్మీయ అభివృద్ధి, శిక్షణలో అనుసరించవలసిన విలువలు వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు.

ఆట పాటలతో ఆహ్లాదకరంగా బిడ్డలకు ఎలా నేర్పించాలో టీచర్లకు శిక్షణ అందించారు. సిబిసి కన్వీనర్ బ్రదర్ బచ్చలకూరి కోటేశ్వర్ ఫ్రాంక్లిన్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి కొమ్ము హోసన్న, సిబిసి డైరెక్టర్ బ్రదర్ పుట్టల జోసఫ్ డానియల్ మాట్లాడుతూ, సిబిసి టీచర్లు సమర్పణతో కూడిన సేవాభావంతో పనిచేయాలని, పిల్లల్లో క్రీస్తు ప్రేమను నాటాలన్నారు.

అలాగే సంఘ అధ్యక్షులు సిహెచ్ సామ్యూల్ జాన్సన్, సంఘ కార్యదర్శి పుట్టల ఇమాన్యుల్, కోశాధికారి పుట్టల నతానియల్, ఉపకోశాధికారి పుట్టల సాంసన్ బంగారుగడ్డ బాప్టిస్ట్ చర్చి ప్రెసిడెంట్ పిఆర్ ఎలీషా గ్రీటింగ్స్ తెలిపారు. సిబిసి డైరెక్టర్ బ్రదర్ పుట్టల జోసఫ్ డానియల్ మాట్లాడుతూ, సిబిసి టీచర్లు దేవుని సేవలో పిలువబడిన వారిగా నిబద్ధతతో, ప్రేమ, సహనంతో పిల్లలకు బోధించి వారి ఆత్మీయ జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అదేవిధంగా 2026 సంవత్సరానికి గాను సిబిసి ప్రధాన అంశం “నా దేశాన్ని ప్రేమిస్తున్నాను” అనే థీమ్ ఆధారంగా పిల్లల్లో దేశభక్తి, నీతి, దేవభక్తి, సేవాభావం పెంపొందించే విధంగా టీచర్లు సేవ చేయాలని ప్రోత్సహించారు. ఈ శిక్షణలో టీచర్లకు కేవలం బోధనా పద్ధతులు మాత్రమే కాకుండా, ప్రార్థన జీవితం, వాక్యంపై ధ్యానం, పిల్లలతో ప్రేమతో వ్యవహరించడం, వారిలో క్రీస్తు స్వభావాన్ని పెంపొందించడం, సువార్తను సృజనాత్మకంగా తెలియజేయడం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టబడింది. అలాగే గ్రూప్ యాక్టివిటీస్, చర్చలు, అనుభవ పంచికల ద్వారా టీచర్లలో ఉత్సాహం, ఐక్యత, సేవా ప్రేరణ మరింత పెంపొందించబడింది. టీచర్లు తమ జీవితాల ద్వారా పిల్లలకు ఆదర్శంగా నిలవాలని సూచించబడింది. అనంతరం ట్రైనింగ్ కు హాజరైన వివిధ సంఘాల వారికి చిన్నపిల్లల నిమిత్తం స్ఫూర్తి చిల్డ్రన్ మినిస్ట్రీస్ ఉచితంగా పుస్తకాలు పంపిణి చేశారు. చిన్న బిడ్డల పట్ల భారమైన పరిచర్యలతో వందలాది సంఘాల్లో సిబిసి బుక్స్ పంపిణి చేస్తూ ముందుకు సాగుతున్న స్పూర్తి చిల్డ్రన్ మినిస్ట్రీస్ కు సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా టీచర్లు పాల్గొని ఆశీర్వాదాన్ని పొందారు. అదేవిధంగా సిబిసి సూపరిండెంట్ బ్రదర్ సాల్మన్ రాజ్, సిబిసి కార్యదర్శి బ్రదర్ దైద పరమనాస్ సంఘ యువకులు హాజరై విజయవంతం చేశారు. మొత్తంగా ఈ శిక్షణతో టీచర్లు ఆత్మీయంగా బలపడి, భవిష్యత్తులో పిల్లల సేవను మరింత ఫలప్రదంగా నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యంపై కొత్త ఉత్సాహం కలిగి, పిల్లల ఆత్మీయ భవిష్యత్తు నిర్మాణంలో తమ వంతు బాధ్యతను మరింత నిబద్ధతతో నిర్వర్తించాలని అందరూ సంకల్పించారు.