యాదాద్రి పవర్ ప్లాంటులో అంబేద్కర్కు నివాళి

నల్లగొండ అక్షిత బ్యూరో: దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడు రాజ్యాంగ ఫలాలను అందుకునేందుకు ఆయన ఆధ్వర్యంలో రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని పేర్కొన్నారు. కార్య క్రమంలో స్టేజ్ -2 చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు స్టేజ్ -1 చీఫ్ ఇంజనీర్ వెంకట వర్మ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంగూరి వెంకన్న, శ్రీనివాస్, శివ పలువురు ఎస్ఈలు, డిఇలు, ఏ ఈ లు అకౌంట్స్ విభాగం, సెక్యూరిటీ విభాగం, కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking