సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.

రామన్నపేట అక్షిత ప్రతినిధి :

రామన్నపేట మండల కేంద్రంలో 11 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CM రిలీఫ్ ఫండ్) చెక్కులను మంగళవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జమీరోద్దీన్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అబ్రహం కుమార్, ఉప సర్పంచ్ మోటి రమేష్, నాయకులు జెల్ల వెంకటేష్, గోదాసు పృథ్వీరాజ్, వనం చంద్రశేఖర్, ఎండి నాసర్, ఎండి అక్రమ్, కోట సుధాకర్, కొమ్ము శేఖర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బట్టే సంతోష్ కుమార్, యాదాసు యాదయ్య, నకిరేకంటి సుదర్శన్, ఎండి మహబూబా అలీ, ఎండి రిజ్వాన్, మహమ్మద్ అజ్మత్, గంగాపురం శంకర్, ఎండి అజార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking