అదనపు డీఆర్‌డీఓ పర్యటన
ఇంద్రపాలనగరం గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలన
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను అదనపు డీఆర్‌డీఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్‌తో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. పనుల నాణ్యత, పారదర్శకత, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారు. ఉపాధి హామీ పనులు సమయానికి పూర్తి చేసి, గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో, ఈసీ, పంచాయతీ సెక్రటరీ, ఎఫ్‌ఏ తదితరులు పాల్గొన్నారు.