సురక్షిత ప్రయాణమే ధ్యేయం


సురక్షిత ప్రయాణమే ధ్యేయం

కాజిపేట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. వెంకన్న

కాజిపేట్, అక్షిత ప్రతినిధి :

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఉర్సుగుట్ట జంక్షన్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణే లక్ష్యంగా భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించరు.రోడ్డు భద్రతపై ఉర్సుగుట్ట వద్ద 600 మంది జ్యోతీరావ్ ఫూలే స్కూల్ విద్యార్థులతో మహా మానవహారం చెప్పటి యువతకు అవగాహన కల్పించారు.’హెల్మెట్ ధరించండి – ప్రాణాలు నిలపండి’ అను నినాదంతో భద్రతా చర్యల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ చేశారు.సురక్షిత ప్రయాణమే ధ్యేయంగా కాజిపేట్ ట్రాఫిక్ పోలీసుల ముందడుగు వేస్తు ఇన్‌స్పెక్టర్ పి. వెంకన్న నేతృత్వంలో విజయవంతముగా ‘అరైవ్ అలైవ్’. కార్యక్రమం చెపట్టారు. ఈ కార్యక్రమానికి వరంగల్ కలెక్టర్ సత్య శారద, అడిషనల్ కలెక్టర్ విజయ, డీసీపీలు దారా కవిత, అంకిత్ కుమార్, ఏఎస్పీ శుభం ప్రకాష్, ఆర్టీవో శోభన్ బాబు, ఇన్‌స్పెక్టర్లు సుజాత, వెంకన్న, రమేష్, ఎమ్మార్వో ఇక్బాల్ పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking