ఐఐటీ విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
ఎంపీడీవో జలంధర్ రెడ్డి
వలిగొండ/ అక్షిత న్యూస్:
మండల కేంద్రంలోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఐఐటి దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ప్రజా పరిషత్ అధికారి జలంధర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఒకప్పుడు ఐఐటి అనేది పట్టణాలకు టౌన్ లకు మాత్రమే పరిమితమై చాలా వ్యయంతో కూడుకున్న చదువు గా ఉండేది ఇప్పుడు దానిని మండల స్థాయికి తీసుకొచ్చిన ఘనత గాయత్రి పాఠశాలకు దక్కింది అని కొనియాడారు రానున్న రోజుల్లో పోటీ ప్రపంచానికి తట్టుకొని నిలబడేటట్లు విద్యార్థులకు ఐఐటి ఎంతో సహాయ పడుతుందని అన్నారు అదేవిధంగా విద్యార్థులు ప్రతి సంవత్సరం ఐఐటి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు ఐఐటిని తీసుకువచ్చిన గాయత్రి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గాయత్రి హై స్కూల్ చైర్మన్ తవటం నరహరి వైస్ చైర్మన్ పనుమటి మురళీధర్ రెడ్డి కరస్పాండెంట్ భీమిడి యాదిరెడ్డి వైస్ ప్రిన్సిపల్ కొంతం బిక్షపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలకుర్ల వెంకటేశం ప్రిన్సిపల్ అనురాధ భీమిడి కవిత రమాదేవి ఐఐటి ఉపాధ్యాయులు ముత్యాలు స్వామి సాయి తేజ ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.