డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం 

మే 7 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్

మూడు విడతలుగా ప్రవేశాలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం 

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు. మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుండి మే 7 వరకు, వెబ్ ఆప్షన్ ఈనెల 30 నుండి వచ్చే నెల 8 వరకు చేసుకోవచ్చని అన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని కళాశాలలో చేరకుండా స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలని అన్నారు. అన్ని అర్హతలు కలిగి అపార అనుభవం ఉన్న అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ లు, డిజిటల్ తరగతి గదులు,గ్రంథాలయం, విశాలమైన క్రీడామైదానం, ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి వంటి సకల సదుపాయాలు కలిగిన కళాశాలలో తప్పకుండా చేరాలని ఆమె అన్నారు

దోస్త్ మూడు దఫాలుగా

 ఈ ఏడాది కూడా డిగ్రీ కోర్సుల్లో సీట్లను మూడు విడతల్లో భర్తీ చేస్తారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే నెల 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30న కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ను నిర్వహిస్తారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking