విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలి 

విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలి 

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి 

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి

రాయపర్తి అక్షిత ప్రతినిధి

నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఢిల్లీలో నీట్ విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలిపిన ఏఐసీసీ అగ్రనాయకులు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాయపర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. విద్యార్థులపై దాడి దేశ భవిష్యత్తుపై దాడి వంటిదని, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, వర్ధన్నపేట ఏఎంసీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మర కళ్యాణ్ గౌడ్, ప్రజాప్రతినిధులు, మండల ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking