మన్మధ్ ఎక్స్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ…
మద్యం మత్తులో వాహనాలు నడిపితే చర్యలు
లోకేశ్వరం ఎస్సై ఎల్.ప్రదీప్
లోకేశ్వరం, జూలై 23 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల పరిధిలోని మన్మధ్ ఎక్స్ రోడ్డు వద్ద గురువారం లోకేశ్వరం ఎస్సై ఎల్. ప్రదీప్,ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు వాహనదారులకు శ్వాస విశ్లేషణ (బ్రీత్ ఎనలైజర్) పరీక్షలు నిర్వహించారు.అనంతరం ఎస్సై ఎల్. ప్రదీప్, మాట్లాడుతూ..మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.తాగి వాహనాలు నడిపే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని,కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వాడాలని సూచించారు.మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వాహనదారులు ప్రయాణ సమయంలో ఆర్‌సి,డ్రైవింగ్ లైసెన్స్,ఇన్సూరెన్స్ తదితర పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పోలీస్ సిబ్బంది ఈ సందర్భంగా కోరారు.ఈ తనిఖీల్లో ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది,హోంగార్డులు పాల్గొన్నారు…