స్వీయ గణనకు జిల్లా కలెక్టర్ శ్రీకారం.

స్వీయ గణనకు జిల్లా కలెక్టర్ శ్రీకారం.

కరీంనగర్ అక్షిత బ్యూరో

జనాభా గణానలో భాగంగా స్వీయ గణనకు జిల్లాలో కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదివారం శ్రీకారం చుట్టారు. కలెక్టర్ స్వయంగా తన వివరాల నమోదు చేసుకొని స్వీయ గణనప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జనాభా గణన ఒక జాతీయ కీలక కార్యక్రమం అని పేర్కొన్నారు. ఇది దేశంలోని జనాభా వారి సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించడంతో పాటు సమర్థవంతమైన ప్రణాళిక సుపరిపాలన వనరుల సమాన పంపిణీకి పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఖచ్చితమైన సమాచారం అందించి జనాభా గణన సిబ్బందికి పూర్తిగా సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. కలెక్టర్ తో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రణాళిక అధికారి రామ్ దత్తారెడ్డి తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking