హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం
ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ
కరీంనగర్ అక్షిత బ్యూరో
హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం అని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ ఉప మండలం ,శ్రీరామ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ఎస్ జిల్లా సహ సంఘచాలక్ ఎలగందల సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ ధర్మం , సనాతన ధర్మం కు శాశ్వత చిరునామా భారతదేశమే అన్నారు. అందుకే ప్రపంచ దేశాల్లో అన్నింటికంటే భారత దేశానికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ సంస్కృతి సంప్రదాయాలుకాపాడుకోవాలన్నారు. దేశ ప్రగతికి సత్యం, ధర్మం వంటి విలువలను ఆచరించడం అవసరమని తెలిపారు. పంచ పరివర్తనల ద్వారా సమాజంలో మార్పు సాధ్యమవుతుందని , ఆ దిశగా ముందుకు కొనసాగాలని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. హిందూ సమాజం ఐక్యత తో ఉండాలన్నారు. హిందూ ధర్మ రక్షణ, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి నడుం బిగించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళన సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం, మజ్జిగ ను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు సరఫ్ రామకృష్ణ , గర్రెపల్లిమహేశ్వర శర్మ అయ్యగారు , మహిళా వక్త అనుపమ లతో పాటు సదాశివ పల్లి, మానకొండూర్ , ముంజంపల్లి, శ్రీనివాస్ నగర్, జగ్గయ్యపల్లి, లింగాపూర్, ఈదులగట్టపల్లి,గ్రామాల హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.