ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంలో పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

రాయపర్తి అక్షిత ప్రతినిధి 

మండలంలోని పేరికవేడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో టిపిసిసి ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో వల్లెపు అనిత–యాదగిరి మరియు దురిశెట్టి లక్ష్మి–యాకయ్య దంపతుల ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి వారికి పట్టువస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటిలో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. గ్రామంలో మరిన్ని ఇండ్లను రెండవ దశలో మంజూరు చేస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత అని ఆమె అన్నారు. అనంతరం గ్రామ వార్డు సభ్యుడు శ్రీకాంత్ కుమారుల పంచెకట్టు వేడుకలో పాల్గొని చిన్నారులను ఝాన్సి రాజేందర్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హమ్యా నాయక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, ఏఎంసి డైరెక్టర్ పుల్లూరు దామోదర్ రెంటాల గోవర్ధన్ రెడ్డి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మునీత వనజారాణి మండల సోషల్ మీడియా కన్వీనర్ బండి రాజేంద్రప్రసాద్ స్థానిక సర్పంచ్ తీగల సాయిలు, ఉప సర్పంచ్ దురిశెట్టి రమేష్ గ్రామ కాంగ్రెస్ నాయకులు గడ్డం సుధాకర్ ఆకారపు వెంకటాచారి వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking