నీర్నెములలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

నీర్నెముల లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండలంలోని నీర్నెముల గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లం సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలు, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు ఆవుల నరేందర్, చిప్పలపల్లి రవీందర్, ఆవుల లక్ష్మి నారాయణ, జెట్టి శివ ప్రసాద్, ఆవుల శ్రీధర్, పరమేష్, యాదయ్య, ఉపేందర్, బాలు, మని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking