అరకొర కమీషన్ తో జీవనం వెళ్లదీస్తున్న రేషన్ డీలర్లు

అరకొర కమీషన్ తో జీవనం వెళ్లదీస్తున్న రేషన్ డీలర్లు

వన్ నేషన్ ,వన్ రేషన్ – వన్ కమీషన్ నినాదంతో డీలర్ల నిరసన

అక్షిత ప్రతినిధి వేములపల్లి:

అరకొర కమిషన్ తో జీవనం వెల్లడిస్తున్న రేషన్ డీలర్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రేషన్ డీలర్ల నంక్షేమ సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు పగిళ్ల.వెంకటేశ్వర్లు అన్నారు.వన్ నేషన్ ,వన్ రేషన్ వన్ కమీషన్ నినాదంతో రేషన్ డీలర్లు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17,200 మంది రేషన్ డీలర్లు గత50 ఏండ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థలో అరకొర కమీషన్లతో అత్తెసరు జీవనం గడుపుతూ జీవితాలనువెళ్లదీస్తున్నారన్నారు. గత కొంత కాలంగా రేషన్ షాపుల అద్దెలు పెరిగిపోయి, కరోనా కారణంగా చేతికింద వర్కర్లు దొరకని పరిస్థితి నెలకొని ఉందని పేర్కొన్నారు. గతంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పంచదార, ఫామోలిన్, కిరోసిన్, గోధుమలు తదితర నిత్యావసరసరుకులసరఫరా నిలిపివేయడంతో డీలర్లు ఉపాధి కోల్పోయి అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు.ప్రభుత్వం డీలర్లకు ఉద్యగ భద్రత కల్పించాల్సిన అవసరమెంతైనా ఉందని,పాత పద్దతిన 14 రకాల నిత్యావసర సరుకులను రేషన్ షాపుల ద్వారా విక్రయించి, మినీ గ్యాస్ సిలిండర్లను , గ్రామీణ పోస్టల్ సేవలకు సైతం రేషన్ డీలర్లను ఉపయోగించుకొని తగిన ఆర్థిక వెసులుబాటు కల్పంచి ఆదుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపి రేషన్ డీలర్లను ఆదుకోవాలని ఆయన కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ఎడల జూలై 11 న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, జూలై 18 న సివిల్ సప్లయ్ కమీషనర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు, అనంతరం ఆగస్టు 02 న హలో డీలర్ చలో డిల్లీ కార్యక్రమంతో పార్లమెంట్ ఎదుట నిరసన కార్యక్రమంలోదేశ వ్యాప్తంగా ఉన్న డీలర్లుపాల్గొంటారన్నారు. డీలర్లు గ్రూపులు, యూనియన్లను పక్కనపెట్టి తమ సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా సాగే ఐక్య ఉద్యమాలకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కందిమళ్ల సుధాకర్ రెడ్డి, డీలర్లు కె.పాండురంగయ్య, ఎ.వెంకటయ్య,గుర్వయ్య, జె.పార్థసారథి, ఈట.రవి,సంతోష్,నాగేశ్వర్రావు, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking