ప్రభుత్వభూమిని కబ్జా

ప్రభుత్వభూమిని కబ్జాచేసిన వ్యక్తులపై చర్య తీసుకోవాలి అఖిలపక్షం

అక్షిత ప్రతినిధి ;వేములపల్లి:

మండలం మల్కపట్నం గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపిటిసి పాదూరి గోవర్దని లు అన్నారు. మంగళవారం స్థానికంగా వారు మాట్లాడుతూ 1952కు ముందు గ్రామకంఠంలో విద్యాభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించేందుకుగాను 27 గుంటల స్థలంలో పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొంతకాలం తర్వాత గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసుకోవడంతో అప్పటినుండి 27 గుంటల స్థలం ఖాళీగానేఉందన్నారు. గ్రామంలో నాయి బ్రాహ్మణులు లేకపోవడంతో గ్రామపెద్దలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సల్కునూరు గ్రామానికి చెందిన పేరెల్లి వెంకటయ్య అనువ్యక్తిని తీసుకువచ్చి అతను తాత్కాలికంగా నివాసం ఏర్పర్చుకునేందుకు ఒకగుంట స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు.వెంకటయ్య మరానంతరం అతని కుమారులు ఉన్నఇంటికి ముందుకిఅదనపు గదులు నిర్మించుకొని ప్రభుత్వ భూమికబ్జాకుపాల్పడటంతో గ్రామస్తులు అడ్డుపడటంతో ఇంటి ముందు ఉత్తరం, దక్షిణం,వైపున ప్రహరీ గోడ నిర్మించుకొని తూర్పు వైపు ఖాళీ భూ కబ్జాకు పాల్పడడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే గ్రామీణ క్రీడా మైదానం ఏర్పాటుకు గ్రామసభలో ఆమోదించి ప్రహరీగోడ నిర్మిస్తుండగా కుటుంబ సభ్యులుఅడ్డు తగిలడంతో గ్రామ ప్రజలు ప్రతిఘటించడం జరిగిందన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ప్రజల ప్రయోజనం కోసంఏర్పాటు చేసే క్రీడా మైదాన పనులకు ఆటంకం కల్పించిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో వారివెంట సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పాదూరి శశిధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పందుల జానకిరాములు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు వడ్డగాని సైదులు, మోసాల శ్రీకాంత్ ,శ్రీనివాస్ రెడ్డి ,కానుగు రాములు, కొలిపాక సత్యం, కప్పి జానయ్య, పందుల సైదులు, కొరిపాక సత్యం, వెంకన్న, పందుల రమణయ్య, భీమయ్య, బక్కయ్య ఉయ్యాల వెంకన్న, శేఖర్ రెడ్డి ,నాగరాజు, హరీష్ తోపాటు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking