అడ్డగోలుగా ఫీజుల వసూల్

అడ్డగోలుగా ఫీజుల వసూల్

ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

అక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్ :

పైలాన్ కాలనీలోని జెన్కో డిఏవి పాఠశాలలో విద్యార్థులకు ఫీజులను ఒకేసారి 40 శాతం మేరకు పెంచడంపై పాఠశాల ప్రిన్సిపాల్ భార్గవ్ కు, జెన్కో ఎస్సీ మంగేష్ నాయక్లకు ఫీజులను తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వినతి పత్రాన్ని అందించారు. ఈ తల్లిదండ్రులు సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో పాఠశాలలు పూర్తిస్థాయిలో నిర్వహించకపోయిన ఫీజులను పూర్తిగా చెల్లించామని ,ఈ ఏడాది ఒకేసారి 40% ఫీజులను పాఠశాల యాజమాను పెంచిందన్నారు.
తమ పాఠశాలలో తమ ఇష్టానుసారము ఫీజులను పెంచుతామని ఇష్టం లేకుంటే పిల్లల్ని టీసీలు తీసుకుని వెళ్లవచ్చునని జెన్కో ఎస్సీ మంగేష్ నాయక్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతున్న ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఫీజులు తగ్గించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking