గ్యాస్ బండ… పేదలకు గుదిబండ
మానవత్వం లేని మోడి సర్కార్
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు వ్యతిరేకంగా శనివారం దామరచర్ల మండలం వాడపల్లిలో నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మానవత్వం లేని మోడీ ప్రభుత్వం పాలనలో డీజిల్, పెట్రోల్ ధరలతో పాటు సామాన్య ప్రజలకు అందని విదంగా వంట గ్యాస్ ధరనుసిలిండర్ కు రూ 50 పెంచడం బిజెపి ద్వందనీతికి నిదర్శమని విమర్శించారు.మోడీ అధికారంలోకి రాకముందు రూ. 400 ఉన్న వంట గ్యాస్ ధర నేడు రూ. 1105 పెంచడం మోడీ దివాలుకోరు పాలనకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసరవస్తువుల ధరలు ఒకవైపున ఆకాశాన్ని అంటుతుంటే మరో వైపు కేంద్ర ప్రభుత్వం చడీచప్పుడు కాకుండా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమన్నారు, పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యుడి జీవితం అతలాకుతలంఅవుతుందన్నారు, టిఆర్ఎస్పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మహిళలుపెద్ద ఎత్తున ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి,జిల్లా రైతు బంధు సమితి సభ్యులు కుందూరు వీరకోటి రెడ్డి, ఎంపిపి నందిని,రవితేజ,జెడ్పిటిసి అంగోతు లలిత-హతిరం, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు యం.డి.యూసుఫ్, వైస్ ఎంపిపి కటికం సైదులు రెడ్డి, సర్పంచ్ కొందుటి మాధవి-సిద్దయ్య, ఉప సర్పంచ్ ఉప్పుతల శ్రీనివాస్, ఎంపిటిసి కామేపల్లి అనంతలక్ష్మీ-శ్రీనివాస్ రెడ్డి, సోము సైది రెడ్డి, బాల సత్యనారాయణ, గువ్వల చంద్రకళ, ముడి సునీత, నడ్డి వెంకటమ్మ, బత్తుల వీర్ల వెంకమ్మ, బాణావత్ విజయ, కేమ్మిశెట్టి నాగలక్ష్మి, ఆనంద్ బుల్లెట్, ఆశీర్వాదం, రఫీ తదితరులు పాల్గొన్నారు.