ఖమ్మం జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు
-ఎంపిజే జిల్లా అధ్యక్షులు ఖాసిం
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీకని ఖుర్బానీ అంటే జంతుబలి కాదు మానవుడు దైవ మార్గంలో తన సర్వస్వాన్ని త్యజిస్తానని చేసే ప్రకటన మాత్రమేనని మూమెంట్ పర్ పీస్ అండ్ జస్టీస్ (ఎంపిజే) జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసీం అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకుని జిల్లా ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దైవాన్ని విశ్వసించడం మానవులంతా ఒకటే అని నమ్మడం బిడ్డల బాధ్యతలు పొరుగు వారి హక్కులు పేదల హక్కులు నెరవేర్చడం చెడును నిరోధించడం మంచిని పెంచడం కష్టాలలో సహనం వహిస్తూ త్యాగ నిరతిని చూపించాలి అన్న సందేశమే ఖుర్బానీలో దాగి ఉందన్నారు. వీటి గురించి దివ్య ఖురాన్ స్పష్టంగా తెలుపుతుందను అన్నారు. దైవం పై విశ్వాసం ఉంచి పది మందికి మంచి చేసే త్యాగనిరతిని పెంపొందించు కోవాలన్నారు.ఖమ్మం జిల్లా ప్రజలంతా శాంతి సహనాలతో కలసి మెలసి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.