రాజీవ్ సాగర్ కు ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ అభినందనలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి : తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, తెలంగాణ జాగృతి క్రియాశీలక సభ్యుడు మేడే రాజీవ్ సాగర్ ను బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసం వద్ద కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బాటలో పయణించి ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలందరికీ తగిన గుర్తింపును ఇవ్వడంతో పాటు పదవులను ఇచ్చి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. నేటి యువతకు రాజీవ్ సాగర్ స్ఫూర్తి ప్రదాత అని భాస్కర్ రావు ప్రశంసించారు. కాగా, ఇటీవల పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా సీఎం కేసీఆర్ ఉద్యమకారులను నియమించిన సంగతి తెలిసిందే.