నిరంతరాయంగా విద్యుత్ ను అందించాలి
అక్షిత ప్రతినిధి, వేములపల్లి : సాగు పనులు చేసుకొనేందుకు రైతులకు24గంటల ఉచిత విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేయాలని వైస్ ఎంపిపి పాదూరి గోవర్దని కోరారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బోరుబావుల ఆధారంగా రైతులు సాగు పనులు చేస్తున్నారని ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిరంతర విద్యుత్ సరఫరా చేయకుండా విడతలవారిగావిద్యుత్ సరఫరా చేస్తుండటంతో దుక్కులు ఎండిపోయి సాగుపనులు ముందుకుసాగడంలేదన్నారు. భూగర్భజలాలు గణనీయంగా ఉన్నప్పటికీ సరిపడ విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారాన్నారు.అధికారులు నిరంతరం విద్యుత్తును సరఫరా చేపట్టనట్లయితేరైతుల పక్షాన నిలబడి సబ్ స్టేషన్లను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. సమావేశంలో ఆమె వెంట నారాయనమ్మ,లలిత, బోడమ్మ,పద్మ, తదితరులు ఉన్నారు.