దినేష్ రెడ్డి మృతదేహానికి నివాళులు
నల్గొండ, అక్షిత ప్రతినిధి:
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో నిన్న శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నార్కట్ పల్లి మాజీ ఎంపిపి, టిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు రేగట్టే దినేష్ రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు.రేగట్టే మల్లికార్జున్ రెడ్డిని,ఆయన కుటుంబ సభ్యులను గుత్తా సుఖేందర్ రెడ్డి ఓదార్చారు.గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నల్గొండ జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ కుమార్ రెడ్డి,నల్గొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, నల్గొండ కౌన్సిలర్ యామ దయాకర్, తదితరులు కూడా దినేష్ గారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.