దినేష్ భౌతిక కాయానికి నివాళులు

దినేష్ భౌతిక కాయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు

నార్కట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ మంగళవారం రాత్రి శంషాబాద్ ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భాస్కర్ రావు నార్కట్ పల్లి చేరుకొని దినేష్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking