కులవృత్తులకు కేసిఆర్ జీవం

సబ్బండ వర్ణాల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కార్ కృషి
* కేసీఆర్ పాలనలో కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం
* మిర్యాలగూడ పట్టణంలో మేరు కుల వృత్తి కేంద్రం ప్రారంభం

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి:

సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ విశేష కృషి చేస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కుల వృత్తులకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ మేరు సంఘం అధ్వర్యంలో స్థానిక బంగారు గడ్డ కాలనీలో నూతనంగా నిర్మించిన మేరు కుల వృత్తి కేంద్రాన్ని భాస్కర్ రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మేరు కులస్తులకు అన్నివిధాల న్యాయం చేస్తున్నారన్నారని అన్నారు. అన్ని కులాల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంతో పాటు సరిపడ నిధులను మంజూరు చేస్తోందన్నారు. కులవృత్తులు అంతరించి పోకుండా పటిష్ట చర్యలు చేపడుతోందన్నారు. కులవృత్తులు చేపడుతున్న వారికి ఆర్ధిక సాయం అందించడంతో పాటు సబ్సిడీలు మంజూరు చేస్తోందన్నారు. మేరు కులస్తుల ఆర్ధిక స్వావలంబన కోసం కేసీఆర్ సర్కార్ కృషి చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మండల విద్యాధికారి ఎం.బాలాజీ నాయక్, మిర్యాలగూడ పట్టణ మేరు సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కృష్ణ, లింగయ్య, సత్యనారాయణ, జగదీష్, సైదులు, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking