వేల్పుల సుజాతకు… డాక్టరేట్

వేల్పుల విజేతకు సమాజసేవలో డాక్టరేట్ ప్రధానం

ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణాధికారిణి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పనాధికారిణి వేల్పుల విజేత కు సమాజ సేవ లో భాగంగా సమాజం పట్ల భాధ్యతగా అంకిత భావంతో చేసిన సేవలను గుర్తించిన ది అమెరికన్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ని ప్రధానం చేశారు.శ్రీమతి వేల్పుల విజేత తన ఉద్యోగ ధర్మాన్ని భాద్యతగా నిర్వహించడంతో పాటుగా సమాజం పట్ల సమాజం లోని నిరుద్యోగ యువత మరియు మహిళల కోరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. తన సొంత నిధులతో జాబ్ మేళాలు పెట్టి ఎందరో యువతకు ప్రవేట్ రంగంలో ఉద్యోగ కల్పన చేశారు.మరియు పేధ విద్యార్థులకు బుక్స్ యూనిపామ్స్ అంద జేశారు.ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రిని అందించారు.

ఉన్నత చదువులు చదవాలి అనుకొని పేదరికం అడ్డువచ్చిన ఏందరో విద్యార్థులకు స్కూలు పిజులు కళాశాల పీజులు కట్టారు.సొంతంగా “విజేత పౌండేషన్” స్థాపించి దాని ద్వార ఏందరో పేద విధ్యార్దులకు విద్యను అందిస్తూన్నారు.ఎంబిబిఎస్ చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా ఆ కళాశాల ఫీజులు చెల్లిస్తూన్నారు. అనేక అనాధ ఆశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.కరోనా సమయంలో కూడా ఎందరో నిరుపేధలకు నిత్యవసర వస్తువులు అందించారు.పేద కళాకారులను ప్రోత్సహించారు.
గోదావరి వరదల సమయంలో ఎంతో తెగువ కనపరచి వరద బాధితులకు సహాయం చేశారు.ప్రతి ఏటా క్రీడలలో ప్రావీణ్యం ఉన్న దివ్యాంగులకు సహాయం అందించి వారిని ఇతర రాష్ట్రాలలో జరిగే క్రీడా పోటీలకు పంపించారు. వారు గెలిచి బహమతలు పొందేవరకు ఆసరాగా నిలిచారు.తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి మహిళలను నడిపించారు. ఉద్యోగ సంఘ నాయకురాలిగా ఎందరో ఉధ్యోగులకు సహాయ సహకారాలు అందించారు.
వారి బదిలీలు ప్రమోషన్ లలో కీలక పాత్ర పోషించారు.విపత్తు వచ్చినా నేను సైతం అంటూ భౌతికంగా సేవ చేస్తూ ఆర్థికంగా కూడా తన తోడ్పాటును అందిస్తున్నారు.అధికారిగా కూడా తన భాధ్యతను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ గత 10 సంవత్సరాలుగా ప్రతిఏటా ఉత్తమ అధికారిణిగా ప్రభుత్వం నుండి అవార్డు అందుకుంటున్నారు.
ఇటువంటి సేవలు చేస్తున్న శ్రీమతి వేల్పుల విజేత సేవలకు గుర్తించిన ది అమెరికన్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను చెన్నై లో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ భారత అంబాసిడర్, సైంటిస్ట్, డాక్టర్ మధు క్రిష్ణన్ ద్వారా డాక్టరేట్ ని ప్రదానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking