చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
పేద విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు
మేడ్చల్, అక్షిత బ్యూరో : క్రమశిక్షణతో చదివితే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లి, ప్రగతి నగర్ లలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు దాతల సహకారంతో సిద్దం చేసిన నోటు పుస్తకాలను ఎమ్మెల్సీ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేదరికం అనే ఆలోచన పక్కనపెట్టి గమ్యం చేరే దిశగా పట్టుదలతో విద్య నభ్య సించాలన్నారు. క్రమశిక్షణగా చదువుకొని అధ్యాపకులకు, పాఠశాలకు, ఊరుకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువులో ప్రతిభ కనబర్చే విద్యార్థులకు తనవంతు సహకారం అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, కో -ఆప్షన్ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, తెరాస కుటుంబ సభ్యులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.