రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి

రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా చేయాలి
అఖిలపక్ష దళిత సంఘాలనాయకుల డిమాండ్

మునుగోడు, అక్షిత ప్రతినిధి :
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలని శుక్రవారం అఖిలపక్ష దళిత సంఘాల నాయకులు పి ఆర్ ఆర్ గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేసి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రజలు రాజీనామా స్వాగతిస్తున్నారని తెలిపారు. కావున మీరు కోరుకున్న విధంగానే మీ రాజీనామాతో మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు మునుగోడు అభివృద్ధి చెందాలి అనే లక్షణం ఆలస్యం లేకుండా తక్షణమే రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గం లో సుమారుగా 38వేలకు పైగా ఉన్న మా దళితులకు దళిత బంధు, మూడు ఎక్కరాల భూమి,డబల్ బెడ్ రూంలు, రావాలి అంటే గతంలో హుజురాబాద్ ఉపఎన్నికల్లో అన్నీ వర్గల ప్రజలకు, అన్ని పథకాలు ఇక్కడ కూడా అమలు చేయాలంటే తక్షణమే రాజీనామా చేయాలి డిమాండ్ చేశారు. అదేవిధంగా హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఏ విధంగా అభివృద్ధి పనులు చేపట్టారు. మా మునుగోడు కూడా అదే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కేసీఆర్ని కోరారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడిగా మునుగోడు మాజీ ఎంపిటిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పందుల భాస్కర్, పందుల శ్రీను, మాల మహానాడు జిల్లా నాయకులు ముచ్చ పోతుల నర్సింహ,తెరాస నాయకులు మునుగోడు మొదటి వార్డ్ మెంబర్ పందుల నర్సింహ, బిజెపి నాయకులు దుబ్బ జెళ్ళయ్య, పోలే రాజ్, బీఎస్పీ, దుబ్బ రాజ్,తీగల రమేష్, జనార్ధన్, ఎస్సీ ఎస్టీ సులేమాన్, ఐ ఎస్ ఓ పి.రవితేజ, కొండపల్లి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking