ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ బడులు

*విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మన ఊరు మన బడి*

*ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తాం*

*ప్రయోగాలతో పాఠాలు విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయి*

*ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సదుపాయాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి*

*ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 
కోదాడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని *కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్* అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు జానీమియా నిధులు నాలుగు లక్షల రూపాయల వ్యయంతో చిలుకూరు,కొండాపురం, నారాయణ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సైన్స్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మన ఊరు మన బడి పథకం తో పాటు స్థానిక సంస్థల నిధుల వెచ్చించి ప్రైవేట్, కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామన్నారు.ప్రయోగాలతో పాఠాలు విద్యార్థుల కు సులభంగా అర్డంవుతాయన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగాన్ని నిర్లక్ష్యం చేయన్నారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాటశాల ల్లో అన్ని సదుపాయాలు కల్పిసున్నామన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత లాక్ష్యాలు సాధించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత లక్షల సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యార్థులు ఉండే లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష సాధన కోసం కృషి చెయ్యాలి అన్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు జిల్లా డైరెక్టర్ కొండా సైదయ్య, స్వతంత్ర సమరయోధులు దొడ్డ నారాయణరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ జనార్దన్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ సురేష్, ఎంపీటీసీ రమణ నాగయ్య, మండల విద్యాధికారి సలీం షరీఫ్, మాజీ జెడ్పిటిసి భట్టు శివాజీ నాయక్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి,ఎంపీడీవో, టిఆర్ఎస్ నాయకులు షైక్ పాషా, మీరా, కస్తూరి నర్సయ్య, నాగరాజు, వెంకటేశ్వర్లు, గన్న అశోక్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking