ఫ్రీడం రన్

స్వతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని చాటాలి
అట్టహాసంగా వజ్రోత్సవ వేడుకలు

కోటగిరి దైవాదీనం

అక్షిత ప్రతినిధి, నల్లగొండ : ప్రజలకు, ప్రభుత్వాలకు నడుమ సమాచారాన్ని అందించడంలో చిన్న మధ్య, దినపత్రికలు, పిరియాడికల్ ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుందని చిన్న ,మధ్య దినపత్రికల, పిరియాడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనం, జిల్లా అధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి మక్సూద్ లు అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో తెలంగాణ స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ స్మాల్ అండ్ మీడియం డైలీ అండ్ పిరియాడికల్ అసోసియేషన్ ప్రతినిధులు భూపతి టైమ్స్ ఎడిటర్ భూపతి రాజు, సత్య ఛానల్ చైర్మన్ గోలి విజయ్ ,పత్రికా ఎడిటర్లు, సంఘం నాయకులు ఎండి శౌకత్ అలి, ఎండి అఫ్జల్ ఖాన్, కారింగుల యాదగిరి, ఎండి ఖుద్దుస్ ,సయ్యద్, పేర్ల వెంకటయ్య ,వీరెల్లి సతీష్, సందీప్, గోవిందు బాలరాజ్, లెనిన్, లింగయ్య ,రాజశేఖర్, ఊర రమేష్, సాగర్, జయంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking