రక్తదానం… మహాదానం

రక్తదానం… మహాదానం
అజాదీ కా అమృత్ మహోత్సవ్

వికారాబాద్, అక్షిత ప్రతినిధి :
అజాదీ కా అమృత్ మహోత్సవ్ వజ్రోత్సవాలలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో శారదా గార్డెన్ పరిగిలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్త దాన శిబిరంలో విజయవంతంగా 178 మంది రక్త దానం చేయడం జరిగింది. ఇందులో పరిగి ఎస్ ఐ విట్టల్ రెడ్డి, 17 మంది కానిస్టేబుళ్లు, 1 హోం గార్డ్ మొత్తం 19 మంది పోలీస్ సిబ్బంది రక్త దానం చేశారు. అదే విధంగా మిషన్ భగీరథ లో పని చేస్తున్న 40 మంది సిబ్బంది స్వచ్చoదంగా రక్త దానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పరిగి డిఎస్పీ కరుణ సాగర్ రెడ్డి, పరిగి సిఐ వెంకట్రామయ్య, 7 మంది ఎస్ ఐ లు  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking