తడి పొడి చెత్త సేకరణ చేపట్టాలి

తడి పొడి చెత్త సేకరణ
బాధ్యతగా గుర్తించాలి

సర్పంచ్ రాజిరెడ్డి

వికారాబాద్, అక్షిత ప్రతినిధి :
తడి పొడి చెత్త సేకరణ బాధ్యతగా గుర్తించాలని సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి అన్నారు. తడి పొడి చెత్త సేకరణ వంద శాతం నమోదు కావాలని తెలిపారు.సహాస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సంస్థ రాష్ట్ర కో ఆర్డినేటర్ శామ్ తడి పొడి చెత్త సేకరణ విషయంలో వికారాబాద్ జిల్లా దోమ గ్రామపంచాయతీ లో మహిళా సంఘాల ప్రతినిధులకు ప్రోజెక్టర్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి దోమ జీపీ మోడల్ ప్రాజెక్ట్ గా ఉన్నందున, ఇక్కడ 80.శాతం తడి పొడి చెత్త సేకరణ సెకరిగేషన్ జరుగుతున్నందున మిగత వారు కూడా పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్ లో వేరు వేరుగా ఇవ్వాలన్న నిబంధనలు గుర్తు చేయాలనీ మహిళా సంఘాల ప్రతినిధులకి గుర్తు చేసారు. ప్రొజేక్టర్ ద్వారా మహిళలకు అవగాహన కల్పిస్తూ ప్రతి రోజు చెత్త సేకరణ ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ సహాస్ సిబ్బంది శివప్రసాద్ మహిళలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking