ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం శిబిరం

ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం శిబిరంమి
* స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహణ
* రక్తదానం చేసిన యువనేత నల్లమోతు సిద్దార్ధ

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రాణాపాయ స్థితిలో, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడేందుకు రక్తదానం సంజీవనిలా దోహదపడుతుందని అన్నారు. సిద్దార్ధ పిలుపు మేరకు పలువురు యువకులు, స్వచ్చంద సంస్థల సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఏఎంసీ మాజీ చైర్మన్లు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, ఎంపీడీవో జ్యోతి లక్ష్మి, టూ టౌన్ సీఐ నిగిడాల సురేశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమరద్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, పట్టణ యువజన అధ్యక్షులు, కౌన్సిలర్ జావిద్, బంటు రమేశ్, శ్రీనివాస్ రెడ్డి, వింజం శ్రీధర్, బాసాని గిరి, శ్రీను, సర్పంచ్ మాలోతు రవీందర్, చింతల వెంకటేశ్వర్లు, షోయబ్, ఇమ్రాన్, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking