
స్వతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ లో ఫ్రీడమ్ కప్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈపోటీల్లో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా, డాక్టర్స్ అసోసియేషన్ ఉద్యోగులు పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన క్రికెట్ పోటీల్లో స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, రన్నర్ అప్ గా రెవెన్యూ ఉద్యోగుల జట్టు నిలిచింది. విజేతలుగా నిలిచిన జట్లకు తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తో కలిసి ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్ధ ట్రోఫీలు ప్రదానం చేశారు.
అనంతరం ఈనెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ స్కూల్ ఛాంపియన్‌షిప్ కప్-2022 బ్రౌచర్ ను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, తహశీల్దార్ అనిల్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, శ్యాంసుందర్ రెడ్డి, పట్టణ యువజన ఉపాధ్యక్షులు యరమల్ల దినేష్, షోయబ్, ఘంట శ్రవణ్ రెడ్డి, నల్లగంతుల నాగభూషణం, ఆర్గనైజర్ కావలి వెంకన్న, ఆర్ఐ శ్యాంసుందర్, తదితతులు పాల్గొన్నారు.