పాపయ్య కుటుంబానికి సిద్దార్ధ పరామర్శ
వేములపల్లి, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ నియోజకవర్గంలో వేములపల్లి మండల కేంద్రానికి చెందిన గుండెబోయిన పాపయ్య యాదవ్ (70) గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ… పాపయ్య నివాసానికి చేరుకొని అయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి నివాళి అర్పించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అనంతరం ఇటివల చనిపోయిన ఉగ్రదండి వనజాత నిర్యాణంలో పాల్గొని ఆమె చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పించారు. సిద్దార్థతో పాటు సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మాలి శంకర్ రెడ్డి, ఉగ్గే మునిశ్వర్, ఉప్పల దుర్గారెడ్డి, దైద జాన్సన్, జడ మట్టయ్య, మాతంగి సుధీర్, అమిరెడ్డి శేఖర్ రెడ్డి, పుట్టల నరసింహ, తిరుమలేష్ తదితతులు ఉన్నారు.