మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలి

మృతుల కుటుంబాలకు
రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలి

ప్రియదర్శని మేడి

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో హిండీస్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదo జరిగిన విషయం తెలుసుకున్న బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అనంతరం రోడ్డు మీద బైఠాయించారు. ప్రమాదం జరిగి చాలా సేపు అయిన కార్మికుల ప్రాణాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. పోలీసులు ఫ్యాక్టరీ లోపలికి ఎవరినీ అనుమతించడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా కంపెనీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. దీనికి కేసిఆర్ ప్రభుత్వం పూర్తి బాద్యత వహించాలన్నారు. యాజమాన్యంతో కుమ్మక్కా ప్రజల ప్రాణలను గాలికి వదిలారు. మరణించిన కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు, గాయపడిన వారికి 2కోట్ల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ముత్యాల రమేష్ నాయకులు మునుగోటి సత్తయ్య, మేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking